‘దేవర’ స్ట్రాటజీ ఫాలో అవుతున్న నీల్.. ఎన్టీఆర్ కోసం పక్కా వ్యూహం!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. గతేడాది దేవర మూవీతో ఎన్టీఆర్ భారీ హిట్ అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఈ మూవీ తరువాత కన్నడ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్, సలార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. #NTRNeel అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.












