మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) మాస్ హీరో గా పేరు తెచ్చుకున్న తనకు నచ్చిన పాత్రలలో అప్పుడప్పుడు కనిపిస్తారు. అలా తన మనసుకు నచ్చిన శివుడి పాత్రలో చిరంజీవి మూడు చిత్రాలలో నటించారు.
అయితే ఇందులో రెండు చిత్రాలలో పాటలలో మాత్రమే శివుడిగా కనిపించి అలరించారు. ఒక సినిమాలో పూర్తి స్థాయి భగవంతుడిగా దర్శనమిస్తారు
1981 లో ఏం ఎస్ కోట రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పార్వతి పరమేశ్వరులు (Parvathi Parameswarulu) చిత్రంలో ఒక పాటలో శివుడిగా కనిపిస్తారు.
ఆ తరవాత 1992 లో కే విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ఆపద్బాంధవుడు (Aapadbandhavudu) చిత్రం లో కూడా ఒక పాటలో శివుడిగా కనిపిస్తారు.
ఆ తరవాత 2001 లో కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన శ్రీ మంజునాథ (Sri Manjunadha) చిత్రంలో పూర్తి స్థాయిలో శ్రీ మంజునాథ స్వామి పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషలలో విడుదల చేశారు.
ఈ రోజు కి శ్రీ మంజునాథ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఈటీవీ, ఈటీవీ సినిమా చానెల్స్ లో ప్రసారమవుతుంది

