సమంత ఇండియా లో నెంబర్ వన్ హీరోయిన్. చాలా సంవత్సరాల తరవాత మా ఇంటి బంగారం తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది సమంత. మా ఇంటి బంగారం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నంబర్స్ చెబుతున్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో 100 వసూళ్లు సాధించిన తొలి తెలుగు హీరోయిన్ గా సమంత (Samantha) సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు
గతంలో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన అరుంధతి అప్పట్లో సుమారు 60 కోట్ల వసూళ్లు సాధించగా, ఆ తరవాత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మహానటి సావిత్రి జీవితం ఆధారం గా తీసిన మహానటి సినిమా సుమారు 70-80 కోట్ల దాకా వసూలు చేసింది. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా 100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది
థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మా ఇంటి బంగారం (Maa Inti Bangaram) జులై 17 నుండి OTT లో స్ట్రీమింగ్ అవబోతోంది. సోషల్ మీడియా లో ఈ విషయాన్నీ ప్రకటించింది జియో హాట్ స్టార్ (Jio Hot Star)

