వరుణ్ తేజ్ హీరో గా మేర్లపాక గాంధీ దర్శకత్వం లో వస్తోన్న హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు. (Korean Kanaka Raju). యూవీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీరాయి ఫేమ్ రితిక నాయక్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
థమన్ స్వరాలూ సమకూర్చిన ఈ కొరియన్ కనకరాజు సినిమా ఆగష్టు 7 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు
హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ది పెనుకొండ బ్యాక్ డ్రాప్. హీరోయిన్ రితిక నాయక్ ది కొరియన్ బ్యాక్ డ్రాప్. ఇప్పటిదాకా తెలుగు దెయ్యాలు, నేషనల్ దయ్యాల కధలు చూసాము. ఇప్పుడు ఇంటర్నేషనల్ దయ్యం కధ ని తీసుకువస్తున్నారు మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi). కొరియన్ దయ్యం పెనుగొండ కుర్రాడిలో దూరితే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్ధం అవుతుంది.

