లార్డ్స్ లో (Lords) సెంచరీ చేసిన మొదటి మహిళా క్రికెటర్ ; లార్డ్స్ లో భారత, ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య జరుగుతోన్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు ఘన విజయం దిశగా అడుగులు వేస్తోంది
భారత మహిళల జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 285 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. స్టార్ ఓపెనర్ స్మ్రితి మందన 83 పరుగులు, కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ 58 పరుగులు, అల్ రౌండర్ దీప్తి శర్మ 57 పరుగులు చేశారు
ఇంగ్లాండ్ మహిళల జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 170 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. పేసర్ క్రాంతి గౌడ్ 5 వికెట్ల తో మెరిసింది. సత్ఘరే, స్నేహ రానా రెండేసి వికెట్ లు తీయగా, దీప్తి శర్మ ఒక వికెట్ తీసుకుంది
భారత మహిళల జట్టు రెండవ ఇన్నింగ్స్ లో ఏడు వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది
యాస్తికా భాటియా (Yastika Bhatia) 113 పరుగులు చేసి లార్డ్స్ లో సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. స్మ్రితి మందన రెండవ ఇన్నింగ్స్ లో కూడా రాణించి 70 పరుగులు చేసింది. రిచా ఘోష్ 52 బంతుల్లో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
457 పరుగుల భారీ లక్ష్యం తో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ మహిళా జట్టు 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడింది
క్రాంతి గౌడ్, సత్ఘరే, స్నేహ రానా లు తలా ఒక వికెట్ తీశారు.
ప్రస్తుతానికి ఇంగ్లాండ్ మహిళల జట్టు రెండవ ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు గెలవడానికి ఇంకా 424 పరుగులు చేయాలి. డ్రా చేసుకోవాలన్న చేతిలో ఉన్న 7 వికెట్ లతో ఈ రోజు, రేపటి రోజు మొత్తం ఆడాలి. దానితో ఇంగ్లాండ్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది

