తమిళ అగ్ర కథానాయకుడు చియాన్ విక్రమ్ (Vikram) నటిస్తోన్న తాజా చిత్రం ‘వీరధీరసూరన్’. ఎస్‌యూ అరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగం. దుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్జే సూర్య(SJ Surya), సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో శ్రీలక్ష్మి మూవీస్, తెలంగాణలో ఎన్వీఆర్ బ్యానర్లు విడుదల చేయనున్నారు. కాగా, ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన వీరధీరసూరన్ టైటిల్ టీజర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో మూవీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. మార్చి 27న వీరధీరసూరన్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ అప్డేట్ తో త్వరలోనే విక్రమ్ ను మరోసారి బిగ్ స్క్రీన్ మీద చూసే అవకాశం రానుందని అభిమానులు ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు. కాగా, మరోవైపు విక్రమ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

