‘దేవర’ స్ట్రాటజీ ఫాలో అవుతున్న నీల్.. ఎన్టీఆర్ కోసం పక్కా వ్యూహం!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. గతేడాది దేవర మూవీతో ఎన్టీఆర్ భారీ హిట్ అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఈ మూవీ తరువాత కన్నడ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్, సలార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel( దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. #NTRNeel అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ (NTR) ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తొలి షెడ్యూల్ లో ఎన్టీఆర్ లేకుండా కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తునట్లు తెలుస్తోంది. కాగా, మార్చి మూడో వారం నుంచి ఎన్టీఆర్ ఈ మూవీ సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో కూడా ‘దేవర’ మూవీ తరహాలోనే బీచ్ కు సంబంధించిన కీలక సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆంధ్రప్రదేశ్ లోని ఓ బీచ్ పరిశీలించారట. అక్కడ లొకేషన్ నచ్చడంతో తదుపరి షెడ్యూల్ ను అక్కడ ప్లాన్ చేసి ఎన్టీఆర్ మీద కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. దీన్ని బట్టి చూస్తే దేవర సినిమా స్ట్రాటజీని ఫాలో అవుతూనే ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

