రవితేజ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్​.. టైటిల్ కూడా ఫిక్స్ చేశారుగా!

by | Feb 26, 2025 | సినిమా

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) ప్రస్తుతం ‘మాస్‌ జాతర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నరన్న సంగతి తెలిసిందే. శ్రీలీల (Sree Leela) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు భాను భోగవరపు  దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను మేలో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ సినిమా తర్వారా రవితేజ చేయబోయే సినిమాల లిస్ట్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ వచ్చి చేరినట్టు తెలుస్తోంది. మూడేళ్ళ కిందట ర‌వితేజ న‌టించిన సూప‌ర్ హిట్ మూవీ ‘ధమాకా’. 2022లో రిలీజైన ఈ మూవీ భారీ హిట్ గా నిలువడమే కాకుండా.. వరల్డ్ వైడ్ గా రూ. 110 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి రవితేజ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. 

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ‘ధమాకా’ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. ఇందులో రవితేజకు జోడీగా శ్రీలీలా నటించింది. అయితే ‘ధమాకా’ మూవీకి ఇప్పుడు సీక్వెల్ తీయబోతున్న‌ట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ప్రస్తుతం ‘మజాకా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సందీప్ కిషన్, రీతూ వర్మ హీరోహిరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. తన తదుపరి సినిమాను రవితేజతో చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఇప్పటికే రవితేజకు తన స్క్రిప్ట్ వినిపించానని, ఈ ప్రాజెక్టును త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించాడు. కాగా, ‘ధమాకా’కి సీక్వెల్‌గా రానున్న ఈ చిత్రానికి ‘డబుల్ ధమాకా’ అనే టైటిల్‌ ఫిక్స్ అయినట్లు సమాచారం.