మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ తాజా చిత్రం ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దాంతో పాటుగా దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమాను చేయనున్నారు. అలాగే అనిల్ రావిపూ(Anil Ravipudi) డితో కూడా ఓ సినిమాను చేయనున్నట్లు చిరు ప్రకటించారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మించనున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల, నానితో ‘ది పారడైజ్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతనే చిరంజీవితో సినిమా ఉంటుందని తెలుస్తోంది. అయితే ‘విశ్వంభర’ (Viswambhara) మూవీ షూటింగ్ పూర్తవగానే చిరు, అనిల్ రావిపూడి సినిమా సెట్స్ లి చేరనున్నట్లు అవనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రారంభించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో చిరంజీవి (Chiranjeevi) డ్యూయెల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పాత్రలూ ఒకదానికొకటి పూర్తి డిఫరెంట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌ని పక్కాగా రూపొందించినట్లు సమాచారం. ఈ మూవీలో మెగాస్టార్ మార్క్ కామెడీని మరో స్థాయికి తీసుకెళ్లేలా అనిల్ రావిపూడి కామెడీని జోడించి ఈ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. ఈ స్క్రిప్ట్ విన్న చిరంజీవి కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దింతో చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి కామెడీ మేనియాను మరోసారి చూడబోతున్నాం అని మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవనుండగా.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారికి ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

