WPL : గుజరాత్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

by | Feb 25, 2025 | వార్తలు

ఉమెన్ ప్రీమియర్ లీగ్ (Women Premiere League) లో భాగంగా గుజరాత్ జెయింట్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. 29 బంతుల్లో 40 పరుగులు చేసిన ఫుల్మలీ గుజరాత్ జెయింట్స్ టాప్ స్కోరర్.  ముగ్గురు గుజరాత్ ప్లేయర్స్ డక్ అవుట్ అయ్యారు

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో శిఖా పాండే, కాప్ సదర్లాండ్ లు తలా రెండు వికెట్లు తీశారు. సాధు, జొనాసేన్ చెరో ఒక వికెట్ తీశారు.

128 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కూడా ఆదిలోనే కెప్టెన్ మెగ్ లానింగ్ వికెట్ ను కోల్పోవడంతో కష్టాల్లో పడినట్లు అనిపించింది.

అయితే షెఫాలీ వర్మ, జొనాసేన్ లు ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు ను పరిగెత్తించారు. రెండవ వికెట్ కు వీరిద్దరూ 74 పరుగులు జోడించారు.  27 బంతుల్లో 44 పరుగులు చేసిన షెఫాలీ వర్మ గార్డనర్ బౌలింగ్ లో అవుట్ అయ్యింది

ఆ తరవాత వచ్చిన జెమిమా రోడ్రిగ్స్, సదర్లాండ్ వెంట వెంటనే అవుట్ అయ్యారు  మరో వైపు జొనాసేన్ ధాటిగా ఆడుతూ కెరీర్ లో తన తొలి అర్ధ సెంచరీ చేసింది.  జొనాసేన్ 32 బంతుల్లో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.  కాప్ తొమ్మిది పరుగులతో అజేయంగా నిలిచింది.

వీరిద్దరూ అజేయంగా నిలిచి ఢిల్లీ క్యాపిటల్స్ ను 6 వికెట్ల తేడాతో గెలిపించారు