టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తున్న తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) . సూపర్ హిట్ చిత్రం మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుంది. డెబ్యూ యాక్టర్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కాగా, కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ పార్టులో శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్‌కుమార్, గోపికా ఉద్యన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
కాగా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ లు అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ క్రమంలోనే ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్. లడ్డుగాని పెళ్లి కథ చుట్టూ ఈ సినిమా కథ నడవనున్నట్లు తెలుస్తోంది. లడ్డుగాని పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ గ్యాంగ్ బ్యాచిలర్ పార్టీ కోసం గోవాకి వెళ్లగా కథ అక్కడ మలుపు తిరుగుతుందనే స్టోరీ లైన్ తో మరోసారి నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణులు మ్యాడ్ మూవీని మించేలా ‘మ్యాడ్ స్క్వేర్’లో కామెడీ పండించబోతున్నారని టీజర్ లో తెలుస్తోంది. కాగా, మార్చి 29న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.

