చిరంజీవిని, రజనీకాంత్ ని నామినేట్ చేసిన మోహన్ లాల్

by | Feb 25, 2025 | వార్తలు

ఈ ఒబెసిటీ గురించి ప్రధాని మోడీ మన్ కి బాత్ లో మాట్లాడారు.  నివేదిక ప్రకారం ప్రపంచంలో సుమారు 250 కోట్ల మంది ఈ ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు.  ప్రతి 8 మంది లో ఒకరికి ఈ సమస్య ఉంది.  ఈ ఊబకాయ సమస్యను  అధిమమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు ఇంట్లో వాడే వంట నూనెలో 10% తగ్గించాలని  ప్రధాని సూచించారు.

ఈ ఊబకాయం సమస్యపై ప్రజలకు అవగాహనా కల్పించాలి అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ ఊబకాయ సమస్యను ఎలా అధిగమించాలి అని విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మోడీ పది మందిని నామినేట్ చేశారు.  అందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) కూడా ఒకరు. తనను నామినేట్ చేసినందుకు మోడీ కి ధన్యవాదాలు తెలుపుతూ, హెల్తీ ఇండియాను నిర్మిద్దామంటూ, తాను కూడా పది మందిని నామినేట్ చేశారు.

#FightObesity కోసం ఈ కీలకమైన ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు మరియు నామినేషన్ కోసం. ఆరోగ్యకరమైన భారతదేశం బుద్ధిపూర్వక ఎంపికలతో ప్రారంభమవుతుంది మరియు అదనపు తినదగిన నూనె వినియోగాన్ని తగ్గించడం సరైన దిశలో ఒక అర్ధవంతమైన అడుగు.

ఇలాంటి ఆలోచనలతోనే ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించగలమని అన్నారు మోహన్ లాల్. ఎడిబుల్ ఆయిల్ వాడకం తగ్గించడం ఊబకాయ సమస్యను తగ్గించడంలో ఒక అర్ధవంతమైన పని అని అన్నారు.  ఈ మిషన్ తో చేతులు కలపడానికి నేను పది మందిని నామినేట్ చేస్తున్నాను

అందరం కలసి కట్టుగా ఆరోగ్యవంతమైన భారత దేశాన్ని నిర్మిద్దాం అని మోహన్ లాల్ అన్నారు. మోహన్ లాల్  చేసిన వారిలో మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi), మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, రజని కాంత్ (Rajani Kanth) కూడా ఉన్నారు.  మోహన్ లాల్ నామినేట్ చేసిన ఆ పది మంది ఎవరో మీరే చూడండి. 

https://twitter.com/Mohanlal/status/1894031701447413770