ఛాంపియన్స్ ట్రోఫీ : సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు !

by | Feb 25, 2025 | వార్తలు

ఛాంపియన్స్ ట్రోఫీ లో గ్రూప్ ఏ లో భారత, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమి ఫైనల్ బెర్త్ ని ఖరారు చేసుకున్నాయి.  అయితే పాయింట్ ల పట్టికలో ఎవరు నెంబర్ 1, ఎవరు నెంబర్ 2 అనేది తేలాలి. 

ఇక గ్రూప్ బి లో, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా లు చెరొక విజయం సాధించాయి.  ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈ రోజు రావల్పిండిలో జరగాల్సిన అత్యంత కీలక మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

వర్షం ఆగకుండా పడుతోండి. అందువలన ఇప్పటివరకు టాస్  కూడా వేయలేదు. వర్షం ఆగిపోయిన, నీటిని తోడేసి, కవర్స్ తీయడానికి కనీసం 90 నిముషాలు పడుతుంది. ఈ సమయంలో  టీ20 తరహాలో మ్యాచ్ ను నిర్వహించడానికి అవకాశం ఉంది.  వీలు లేని పక్షంలో మ్యాచ్ ని రద్దు చేసి చెరో పాయింట్ ఇస్తారు

కీలక మ్యాచ్ రద్దు అయితే, ఇతర టీం ల సెమిఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపుతుంది