తెలుగు చిత్రసీమలో వరుస విజయాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ జోష్ మీదున్నారు. ఇదే జోరును కొనసాగిస్తూ.. ప్రభాస్ వరుసగా సినిమాలు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ అనే యంగ్ బ్యూటీ నటిస్తోంది. ఇప్పటికైతే ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 1940ల్లో జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. దీన్ని చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న కథాంశంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ముగియగా.. అందులో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సమయంలోనే ప్రభాస్ కు గాయం అవడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం గాయం నుండి పూర్తిగా కోలుకున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా షూటింగ్ మార్చి రెండో వారంలో తిరిగి ప్రారంభించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ ప్రభాస్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్శివార్లలో ప్రత్యేకంగా సెట్ వేయనున్నారని. ఈ షెడ్యుల్ లో ప్రభాస్ పై నిజాంకు వ్యతిరేకంగా పోరాడే యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారని సమాచారం.
ఇదిలాఉంటే.. ‘ఫౌజీ’ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఓ యువరాణి పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఇటీవలే మేకర్స్ ఆలియాను సంప్రదించగా వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా,’ఫౌజీ’ సినిమాలో ప్రభాస్‌తో పాటు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

