తారక్ ప్రస్తుతం హ్రితిక్ రోషన్ తో కలిసి వార్-2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు లో తదుపరి సినిమా ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు. అయితే సినిమా బడ్జెట్ 300 కోట్ల పైనే ఉండచ్చని అంచనా. తారక్ గత సినిమా ‘దేవర’ 200 కోట్ల బడ్జెట్ తో నిర్మితమై
తారక్ ప్రస్తుతం హ్రితిక్ రోషన్ తో కలిసి వార్-2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు లో తదుపరి సినిమా ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు. అయితే సినిమా బడ్జెట్ 300 కోట్ల పైనే ఉండచ్చని అంచనా. తారక్ గత సినిమా ‘దేవర’ 200 కోట్ల బడ్జెట్ తో నిర్మితమై
సీనియర్ హీరోల దర్శకుడు మరో కొత్త సినిమాతో
బాబీ వరసగా సీనియర్ హీరోలతోనే సినిమాలు తీసున్నాడు.
2019 లో విక్టరీ వెంకటేష్ తో వెంకీ మామ తీసిన దర్శకుడు బాబీ 2023 లో మెగా స్టార్ చిరంజీవి తో వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత 2025 లో మరో సీనియర్ హీరో బాల కృష్ణ తో ‘డాకు మహారాజ్’ తీశాడు.
గేమ్ చేంజర్ నుండి ‘ధోప్’ సాంగ్ విడుదల
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన గేమ్ చేంజర్ నుండి ‘ధోప్’ ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్, సెట్టింగ్స్, థమన్ మ్యూజిక్ చాలా బాగున్నాయి.
విశ్వక్ సేన్ ‘లైలా’ నుండి లిరికల్ సాంగ్ ఓహ్ రత్తమ్మ విడుదల. ఈ సినిమా ఫిబ్రవరి 14 న విడుదలవుతోంది
నాచురల్ స్టార్ నాని పై కన్నడ నిర్మాత ఆరోపణలు
నాని హీరో గా, మృణాల్ ఠాకూర్ హీరోఇన్ గా నటించిన హాయ్ నాన్న సినిమాపై కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య తీవ్రమైన ఆరోపణలు చేశారు
పుష్కర మల్లికార్జునయ్య తీసిన ‘భీమసేన నలమహారాజు’ సినిమా కరోనా కారణం గా 2020 లో నేరుగా ఓ టి టి లో విడుదలయింది
ఇటీవలే అమరన్ తో సూపర్ హిట్ కొట్టిన శివ కార్తికేయ మరో ఇంటరెస్టింగ్ సబ్జెక్టు తో మన ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సారి పీరియాడిక్ సబ్జెక్టు ఎంచుకున్నాడు. ఈ సినిమాకు పరాశక్తి అనే టైటిల్ ఖరారు చేశారు. ఆకాశమే నీ హద్దురా చిత్రానికి దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ చిత్రానికి...
• హరి హర వీర మల్లులో ని మొదటి సాంగ్ ‘మాట వినాలి’ పాట వెనుక జరిగిన సన్నివేశాలతో వీడియో ని విడుదల చేశారు. ఈ పాటను పవన్ కల్యాణ్ గారు పాడారు. ఏ ఏం రత్నం సమర్పిస్తోన్న ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకులు. నిధి అగర్వాల్ కధానాయిక. ఏం ఏం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిచారు
తండేల్ ట్రైలర్ విడుదల
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకులు. ఫిబ్రవరి 7 న ఈ సినిమాను విడుదల చేయనున్నారు
ఆసక్తికరం గా ఉన్న బ్రహ్మాజీ, ఆమని ల బాపు టీజర్
గేమ్ చేంజర్ నుండి జరగండి, జరగండి వీడియో సాంగ్ విడుదల
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన గేమ్ చేంజర్ నుండి ‘జరగండి జరగండి’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. 600 మంది డాన్సర్స్ ఉన్న ఈ సాంగ్ కి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. పాట మంచి కలర్ ఫుల్ గా ఉంటుంది. ఈ పాటకు సంబంధించిన సెట్, కాస్ట్యూమ్స్ అన్ని జనపనారతో చేశారు. మీరు చూసేయండి
ప్రభాస్ లుక్ విడుదల డేట్ ను ఖరారు చేసిన కన్నప్ప టీం
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ లు సంయుక్తం గా నిర్మిస్తోన్న మూవీ ‘కన్నప్ప’. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో వస్తోన్న ఈ సినిమాను మంచు విష్ణు, మోహన్ బాబు ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు
ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ను కొంత వరకు ఈ రోజు చూపించారు. ఫిబ్రవరి 3 న, ప్రభాస్ లుక్ ను విడుదల చేయబోతున్నారు.
తమిళ సూపర్ స్టార్ విజయ కధానాయకుడి గా, హెచ్ వినోద్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు ‘జన నాయగన్ అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్ర టైటిల్ ను ప్రకటిస్తూ అధికారికంగా ఒక పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్.
‘తమిళగ వెట్రి కళగం’ అనే రాజకీయ పార్టీ ని స్థాపించిన తరవాత విజయ నటిస్తోన్న సినిమా ఇది. తన రాజకీయాలకు కూడా పనికొచ్చేలాగా ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ లో విజయ్, తన అభిమానులతో సెల్ఫీ దిగుతున్నట్లు ఉంది.