తారక్ ప్రస్తుతం హ్రితిక్ రోషన్ తో కలిసి వార్-2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు లో తదుపరి సినిమా ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు. అయితే సినిమా బడ్జెట్ 300 కోట్ల పైనే ఉండచ్చని అంచనా. తారక్ గత సినిమా ‘దేవర’ 200 కోట్ల బడ్జెట్ తో నిర్మితమై సుమారు 500 కోట్ల రూపాయలు వసూలు చేసిందట. ట్రాక్ రికార్డు ని బట్టు తారక్ మీద 300-400 కోట్ల రూపాయల ఖర్చు పెట్టొచ్చని నిర్మాతల భావన.
దీనిని బట్టి తారక్, ప్రశాంత్ నీల్ తో చేయబోయే డ్రాగన్ సినిమా బడ్జెట్ ను 300-350 కోట్లకు ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తం గా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
ఈ సమ్మర్ లో ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసి, బహుశా 2026 వేసవి సెలవుల కు తీసుకు రావాలని ప్లాన్ చేస్తారేమో చూడాలి.
ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఏ సినిమా అయినా పాన్ ఇండియా సినిమానే

