జోరు మీదున్న దుల్కర్ సల్మాన్

by | Feb 3, 2025 | సినిమా

మలయాళ సూపర్ స్టార్ కొడుకైన దుల్కర్ సల్మాన్ తెలుగు లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.  దుల్కర్ తెలుగు లో నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.  దుల్కర్ నేరుగా తెలుగు లో నటించిన మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలు ఘనా విజయం సాధించాయి. ఇదే ఊపులో కొత్త సినిమా స్టార్ట్ చేశారు

దుల్కర్ కధానాయకుడిగా, పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశం లో ఒక తార’ చిత్రం ప్రారంభమయ్యింది

ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  లైట్ బాక్స్ మీడియా పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

ఈ సినిమా నిన్న ఆదివారం లాంఛనంగా ప్రారంభమయ్యింది.  అల్లు అరవింద్ ముహూర్త సన్నివేశానికి క్లాప్ కొట్టగా, అశ్విని దత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.  గుణ్ణం గంగరాజు ఈ సినిమా రచయిత 

ఇప్పటికే తెలుగులో హ్యాట్రిక్ విజయాలు సాధించిన దుల్కర్ సల్మాన్, ఈ సినిమాతో, రెండవ హ్యాట్రిక్ కు శ్రీకారం చుడతారేమో వేచి చూడాలి