వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రపంచ వ్యాప్తంగా 303 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఒక రీజినల్ ఫిలిం 303 కోట్ల కలెక్షన్స్ అల్ టైం ఇండస్ట్రీ హిట్ అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పోస్టర్ ని విడుదల చేసింది
వెంకటేష్, అనిల్ రావిపూడి కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్. అంతే కాదు దిల్ రాజు కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి హిట్ చూడలేదు
విక్టరీ వెంకటేష్ కు ఉన్న ఫామిలీ ఆడియన్స్ ఇమేజ్, అనిల్ రావిపూడి కామెడీ బ్రాండ్ ఇమేజ్, సూపర్ హిట్ పాటలు, పండగ సీజన్లో లో విడుదల కావడం, సంక్రాంతి పండగకు వచ్చిన మిగతా సినిమాలు అంతగా ఆకట్టుకోక పోవడం వంటి అంశాలు ఈ సినిమాకు బాగా కలిసి వచ్చాయి. ముఖ్యం గా ఈ సినిమాలో వెంకటేష్ కొడుకు పాత్రలో భీమవరం బుల్లిరాజు రేవంత్ నటనకు అందరు ఫిదా అవుతున్నారు.

