కన్నప్ప సినిమాలో ప్రభాస్ లుక్ చూశారా

by | Feb 3, 2025 | సినిమా

మంచు విష్షును హీరో గా మోహన్ బాబు నిర్మిస్తోన్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప.  ఇప్పుడు ఈ చిత్రం నుండి ప్రభాస్ లుక్ ను విడుదల చేశారు.  ఈ చిత్రం లో ఇంకా అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లు నటిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించారు

ఇప్పుడు తాజాగా కన్నప్ప నుండి రుద్రుడు పాత్రలో ప్రభాస్ లుక్ ని విడుదల చేశారు

మహా భారత్ సీరియల్ కు దర్శకత్వం వహించిన ముకేశ్ కుమార్ సింగ్ ఈ పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ కు దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమా లో ఎక్కువ భాగం న్యూజిలాండ్ లో చిత్రీకరించారు. గతం లో ఆ ఫొటోలు  సోషల్ మీడియా మేకర్స్ షేర్ చేశారు

ప్రపంచ వ్యాప్తం గా ఈ సినిమాని భారీస్థాయిలో ఏప్రిల్ 25 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  సమ్మర్ హాలిడేస్ కూడా ఉండడం ఒక అడ్వాంటేజ్.  భారీ వ్యయం తో నిర్మిస్తోన్న ఈ సినిమా విజయవంతం కావడం మోహన్ బాబుకు, మంచు విష్షుకు ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చాలా అవసరం