5 వ టి 20 లో 150 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

by | Feb 2, 2025 | వార్తలు

ముంబై లో జరిగిన 5 వ టి 20 లో ఇంగ్లాండ్ పై 150 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.  దీనితో భారత్ సిరీస్ ను 4-1 తో గెలుచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ చేసింది.  ఓపెనర్ అభిషేక్ శర్మ టి 20 ల్లో రెండవ వేగవంతమైన శతకం చేశాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ చేశాడు.  గతం లో రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు.  ఇందులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి

ఓపెనర్ సంజు శాంసన్ 16 పరుగులు చేసి మరోసారి విఫలమయ్యాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  తిలక్ వర్మ వేగంగా 24 పరుగులు చేశాడు.  శివమ్ దూబే కూడా వేగం గా ఆడి 13 బంతుల్లో 30 పరుగులు చేశాడు

ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్ మూడు వికెట్లు తీయగా, వుడ్ రెండు వికెట్లు తీశాడు. ఆర్చర్, రషీద్, ఓవర్టన్  తలా ఒక వికెట్ తీశారు

అనంతరం 247 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు క్రీజ్ లో కుదురుకోవాలనే ఆలోచన లేకుండా,  కెప్టెన్ బట్లర్ తో సహా వికెట్లు అందరు వికెట్లు పారేసుకున్నారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒక్కడే ధాటిగా ఆడుతూ  23 బంతుల్లో 55 పరుగులు చేశాడు.  ఫిల్ సాల్ట్ తరవాత రెండంకెల స్కోర్ చేసింది ఒక్క బెథెల్ మాత్రమే. అది కూడా సరిగ్గా 10 పరుగులు

భారత బౌలర్లలో షమీ  మూడు వికెట్ లు తీయగా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ, శివమ్ దూబే రెండేసి వికెట్ లు తీయగా బిష్ణోయ్ ఒక వికెట్ తీశాడు.