భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టి 20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఓపెనర్ అభిషేక్ శర్మ టి 20 ల్లో రెండవ వేగవంతమైన శతకం చేశాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ చేశాడు. గతం లో రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేశాడు
అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఇందులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి
ఓపెనర్ సంజు శాంసన్ 16 పరుగులు చేసి మరోసారి విఫలమయ్యాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ వేగంగా 24 పరుగులు చేశాడు. శివమ్ దూబే కూడా వేగం గా ఆడి 13 బంతుల్లో 30 పరుగులు చేశాడు
ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్ మూడు వికెట్లు తీయగా, వుడ్ రెండు వికెట్లు తీశాడు. ఆర్చర్, రషీద్, ఓవర్టన్ తలా ఒక వికెట్ తీశారు

