టాప్ 10 న్యూస్

by | Feb 2, 2025 | వార్తలు

  • మైక్రో సాఫ్ట్ లో పని తీరు మెరుగుపరుచుకొని ఉద్యోగులపై వేటు. ఇంతకు ముందు మైక్రోసాఫ్ట్ సెక్యూరిటి, సేల్స్, డివైజ్, గేమింగ్ డిపార్ట్మెంట్ లలో ఉద్యోగులను తొలగించింది
  • పతంజలి వ్యవస్థాపకులు రామ్ దేవ్ బాబా, పతంజలి సంస్థ ఎండీ ఆచార్య బాల కృష్ణ లకు కేరళ హై కోర్ట్ నాన్ బెయిలబుల్ ఆరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తప్పుడు ప్రచారాలు, తప్పు దోవ పట్టించే ప్రకటనల నేపథ్యంలో ఈ అరెస్ట్ వారంట్ జారీ అయ్యింది
  • ట్రంప్ కు కౌంటర్ గా మెక్సికో, కెనడా దేశాలు ప్రతీకార చర్యలు చేపట్టాయి.  కెనడా ప్రధాని ట్రూడో అమెరికా దిగుమతులపై 25% సుంకం విధించారు. మెక్సికో కో అమెరికా దిగుమతులపై సుంకం విధించే దిశగా ప్రయాణిస్తోంది
  • కుల గణన సర్వే ప్రకారం, తెలంగాణ లో బీసీ ల జనాభా స్ 46.25% అని మంత్రి ఉత్తమ్ చెప్పారు. మైనారిటీ బీసీ ల జనాభా మరో 10 శాతం కలుపుకుంటే మొత్తం 56% అన్నమాట. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ ల జనాభా 12.56%. ఓసీ జనాభాత్ 15.79%
  • కుంభమేళాలో, ఇప్పటివారు 33 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది
  • సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఫిబ్రవరి 8 నుండి మార్చ్ 2 వరకు జరుగుతుంది. మొదటి మ్యాచ్ బెంగుళూరు లో జరుగుతుంది
  • మహాశివరాత్రి రోజున విశ్వంభర టీం మొదటి సింగల్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు
  • మరి కొద్దీ సేపట్లో భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరి టి 20 మ్యాచ్ ముంబైలో ప్రారంభమవుతుంది.  వన్ డే సిరీస్ ఫిబ్రవరి 6 న ప్రారంభమవుతుంది
  • భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష అండర్ 19 వరల్డ్ కప్ లో ప్లేయర్ అఫ్ ది మ్యాచ్, ప్లేయర్ అఫ్ ది టోర్నమెంట్ అవార్డు లు గెలుచుకుంది.  త్రిష ఫైనల్ మ్యాచ్ లో 44 పరుగులు, 3 వికెట్లు తీశారు. టౌర్నమెంట్ మొత్తంగా 309 పరుగులు చేసింది, 7 వికెట్లు తీశారు. 
  • హైదరాబాద్ ఉప్పల్ లో అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ షాప్ మూర్తి కంఫోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో  అగ్ని ప్రమాదం. భారీగా ఆస్థి నష్టం