ఈ సినిమా మీ పిల్లలకు చూపించండి

by | Feb 2, 2025 | ప్రగడ టీవీ

అరవింద్ స్వామి, కార్తీ నటించిన సినిమా ‘సత్యం  శివమ్ సుందరం’.  సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాతృక తమిళం. అయినా ఈ సినిమా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఒకసారైనా చూడాల్సిన సినిమా

ఈ సినిమాలో ఒక హీరో కి తన ఊరన్నా, తన తాతల కాలం నాటి ఇళ్లన్నా చాలా ఇష్టం. ఎన్నేళ్లు గడిచిన తన సొంత ఊరు, ఇంటి జ్ఞాపకాలు తన వెంటాడుతూనే ఉంటాయి.  అటువంటి పరిస్థితులలో, ఒక పెళ్లి కి తన సొంత ఊరికి వెళ్లిన హీరోకి, ఇంకొక హీరో చుట్టరికం కలుపుతూ మాట్లాడుతుంటాడు. అసలు ఇతను ఎవరు, ఎందుకు నాతో చుట్టరికం కాల్పుతున్నాడు అనే విషయం సినిమా చూసి తెలుసుకోండి

పిల్లలకు ఈ సత్యం, సుందరం సినిమాను చూపించండి.  మీ పిల్లలకు బంగారు బాల్య జ్ఞాపకాలను ఇవ్వండి.  దీనివల్ల పిల్లలకు తల్లి తండ్రుల మీద గౌరవం పెరుగుతుంది

కమర్షియల్ సినిమాలే ఇలాంటి సినిమాలు కూడా అప్పుడప్పుడు చూడవచ్చు.  ఈ సినిమాని వచ్చే ఆదివారం, అంటే  ఫిబ్రవరి 9 న,   స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సాయంత్రం 6 గంటలకు ప్రసారమవుతుంది

కొన్ని సినిమాలు. కొన్ని జ్ఞాపకాలు. సత్యం శివమ్ సుందరం కూడా మీకు మంచి జ్ఞాపకం అవుతుంది.

ఈ సినిమాలో మీకు నటులు ఎవరు కనపడరు. క్యారెక్టర్ లు మాత్రమే కనిపిస్తాయి. కాదు జీవిస్తాయి. ఇది సినిమా కాదు. జీవితం