నాచురల్ స్టార్ నాని పై కన్నడ నిర్మాత ఆరోపణలు

by | Jan 30, 2025 | సినిమా

నాని హీరో గా, మృణాల్ ఠాకూర్ హీరోఇన్ గా నటించిన హాయ్ నాన్న సినిమాపై కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య తీవ్రమైన ఆరోపణలు చేశారు

పుష్కర మల్లికార్జునయ్య తీసిన  ‘భీమసేన నలమహారాజు’  సినిమా కరోనా కారణం గా 2020 లో నేరుగా ఓ టి టి లో విడుదలయింది

తాను నిర్మించిన ‘భీమసేన నలమహారాజు’ సినిమా ఆధారంగా నాని నటించిన ‘హాయ్ నాన్న’ సినిమాను తీశారు అన్నారు.

నాని నటించిన ‘హాయ్ నాన్న’ 2023 లో విడుదలై పెద్ద హిట్ గా నిలిచింది.  నానికి మంచి పేరు వచ్చింది.  వైరా ఎంటర్టైన్మెంట్ పై, సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి సౌర్యువ్ దర్శకుడు

రీమేక్ హక్కులు కొనుగోలు చేయకుండా, తమ సినిమాని హ్’హాయ్ నాన్న’ పేరుతో తెలుగు లో తీశారన్నారు. అంతే కాకుండా, ఇలాంటి నీచమైన పనులు ఎలా చేశారని ప్రశ్నించారు, కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య.

అయితే ఈ వివాదంపై హీరో నాని, దారస్కుడు సౌర్యువ్, నిర్మాత సుధాకర్ చెరుకూరి ఇంకా స్పందించాల్సి ఉంది.