ఆంధ్ర ప్రదేశ్ వాట్స్ అప్ గవర్నెన్స్ : మన మిత్ర

by | Jan 30, 2025 | రాజకీయాలు

భారత దేశంలో మొదటి సారిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకు వచ్చింది.  వాట్సాప్ నెంబర్ : 95523 00009. 

మొదటి ఫేజ్ లో 161 రకాల సేవలను అందించాలని ప్రభుత్వం యోచన చేస్తోంది.  కీలకమైన శాఖల సేవలను మొదటగా అందించనుంది.  రెవిన్యూ, మున్సిపల్, దేవాదాయ, ఇంధన,ఎ పీస్ర్టీసీ శాఖలకు సంబంధించిన సేవలు మొదట ప్రారంభిస్తారు.,

ఈ వాట్సాప్ నెంబర్ (గవర్నెన్స్)  ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటుంది.  ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను ప్రజలకు ఈ వాట్స్ అప్ నెంబర్ ద్వారా పంపించవచ్చు.  కోట్ల మందికి ప్రభుత్వ పధకాలు, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని సునాయాసంగా ఈ వాట్స్ అప్ నెంబర్ ద్వారా  చేరవేయవచ్చు 

అంతే కాకుండా ప్రజలు తమ విన్నపాలను, ఫిర్యాదులను ఈ వాట్స్ అప్ నెంబర్ ద్వారా ప్రభుత్వానికి తెలియ చేయవచ్చు.  వాట్ యాన్  ఐడియా సర్ జి