కోలీవుడ్ స్టార్ విజయ్ సినిమా పేరు జన నాయగన్

by | Jan 27, 2025 | సినిమా

తమిళ సూపర్ స్టార్ విజయ కధానాయకుడి గా, హెచ్ వినోద్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు ‘జన నాయగన్ అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్ర టైటిల్ ను ప్రకటిస్తూ అధికారికంగా ఒక పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్.

‘తమిళగ వెట్రి కళగం’ అనే రాజకీయ పార్టీ ని స్థాపించిన తరవాత విజయ నటిస్తోన్న సినిమా ఇది.  తన రాజకీయాలకు కూడా పనికొచ్చేలాగా ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ లో విజయ్, తన అభిమానులతో సెల్ఫీ దిగుతున్నట్లు ఉంది.

కె వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజ హెగ్డే కధానాయిక.  ఇంకా ప్రకాష్ రాజ్, ప్రియమణి, బాబీ డియోల్ లు కూడా ఈ చిత్రం లో నటిస్తున్నారు

ఈ సినిమా విజయ్ ఆఖరి చిత్రం అంటున్నారు.  కాబట్టి అంచనాలు భారీగా ఉంటాయి. మరో పక్క, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం తో  పార్టీ ని స్థాపించి 2026 ఎన్నికలే లక్ష్యం గా దూసుకుపోతున్నారు కోలీవుడ్ స్టార్, దళపతి  విజయ్

2025, 2026 సంవత్సరాలలో, సినిమాలైన, రాజకీయాలైన వేసే ప్రతి అడుగు  విజయ్ కు చాలా కీలకం.  ఎందుకంటె అవి తన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి