మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర చిత్రానికి దర్శకుడు వశిష్ట. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. త్రిష ఈ చిత్రంలో చిరంజీవి తో నటిస్తోంది.
చాలా రోజుల తర్వాత, చిరంజీవి ఒక ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. అంచనాలు భారీగా ఉన్నాయి. 70 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. అయితే ఆ టీజర్ గ్రాఫిక్స్ పై కొన్ని వర్గాల ప్రేక్షకులనుండి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. టీం వాటిని సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు
ఈ సినిమా పై దర్శకుడు వశిష్ట, చిరంజీవి ఖైదీ సినిమాకి సంబంధించిన వింటేజ్ వీడియో ని పోస్ట్ చేసి ఫైర్ ఎమోజి ని జత చేశారు. ఈ పోస్ట్ తో ప్రొమోషన్స్ మొదలుపెడుతున్నారు అన్న సందేహం కలుగుతోంది. ఈ సినిమా మే 9 న ప్రపంచ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు

