భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టీ 20 మ్యాచ్ లో, టాస్ గెలిచిన భారత్, ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇంగ్లాండ్ జట్టు ధాటిగా ఆడే క్రమంలో వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. 20 ఓవర్ లు ముగిసే సరికి ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల 165 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ బట్లర్ 45 పరుగులు, స్మిత్ 22 పరుగులు, కార్స్ 31 పరుగులు చేశారు
భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీశారు. సుందర్, హార్దిక్ పాండ్య, అర్షదీప్ సింగ్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ తీశారు
అనంతరం 166 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మొదట్లో కొంత తడబాటుకు గురయ్యింది. మొదటి మ్యాచ్ హీరో అభిషేక్ శర్మ 12 పరుగులకే అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ ధాటిగా ఆది 19 బంతుల్లో 26 పరుగులు చేశాడు
అయితే మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఒంటరి పోరాటంతో మ్యాచ్ ను గెలిపించాడు. తిలక్ వర్మ 55 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి

