తెలుగు పద్మాలకు అభినందనలు

by | Jan 25, 2025 | వార్తలు

కేంద్ర ప్రభుత్వం గణ తంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ప్రకటించే పద్మ అవార్డు లను ప్రకటించింది. 

నందమూరి బాలకృష్ణకు కళా రంగంలో పద్మ భూషణ్ , వైద్య విభాగంలో డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్ అవార్డు లు లభించాయి.  అంతే కాకుండా మరికొంతమందికి పద్మశ్రీ అవార్డు లభించింది 

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కే ఎల్ కృష్ణకు విద్య, సాహిత్యంలో, మాడుగుల నాగ ఫణి శర్మకు కళా రంగంలో, మంద కృష్ణ మాదిగ కుప్రజారంగంలో, మిరియాల అప్పారావు కు కళా రంగంలో, రాఘవేంద్రాచార్య పంచముఖి విద్య, సాహిత్యంలో పద్మశ్రీ లభించింది 

పద్మశ్రీ అవార్డు లభించిన ఐదుగురిలో మంద కృష్ణ మాదిగ తెలంగాణకు చెందిన వారు కాగా, మిగతా నలుగురు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు

తెలుగు పద్మాలకు అభినందనలు.  Congratulations to all the winners