లెనిన్ తో అఖిల్ ఈసారైనా హిట్ కొడతాడా !?

by | Jul 9, 2026 | సినిమా | 0 comments

అక్కినేని నాగార్జున నట వారసుడిగా తెరంగేట్రం చేసిన అక్కినేని అఖిల్ కు ఇప్పటివరకు సరైన హిట్ రాలేదు.  ‘మనం’ సినిమా హిట్ అయినా అది అఖిల్ సోలో హీరో సినిమా కాదు.  అఖిల్ ఏజెంట్ సినిమా బాక్సఫీస్ వద్ద అతి పెద్ద ప్లాప్ గా నిలిచింది.  Most Eligible Bachelor పరవాలేదనిపించినా సరైన హిట్ హిట్ కొట్టలేకపోయాడు.

అయితే లెనిన్ సినిమాతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు అఖిల్.  నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ లెనిన్ చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ  బోర్స్ హీరోయిన్.

జులై 10 న, అనగా రేపు ఉదయం ఈ లెనిన్ సినిమా విడుదలవుతోంది.  ఈ రోజు పడాల్సిన ప్రీమియర్ షో లు కూడా రద్దు  చేశారు.   అయితే లెనిన్ ట్రైలర్ చూస్తే అంత అద్భుతంగా ఏమి లేదు.

ట్రైలర్ కు నాగార్జున వాయిస్ ఓవర్, సినిమా కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కలిసొచ్చే అంశాలు.  అయితే ట్రైలర్ అంత అద్భుతంగా లేదనే చెప్పాలి.  ఎన్నో ఏళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తోన్న అఖిల్ కు ట్రైలర్ చూస్తే హిట్ సినిమా ట్రైలర్ లా లేదు. అయితే కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం, కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా …యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలని. ఒక్కొక్క పాత్ర రంగుల మార్చడం మొదలు పెట్టాయి’ వంటి సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.  ఈ సినిమాలో పాత్రలు మహాభారతం పాత్రలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని తెలుస్తోంది

ఇప్పుడున్న పరిస్థితులలో థియేటర్ల కు ప్రేక్షకులను రప్పించాలంటే సినిమా కంటెంట్ ఆకట్టుకునేలా ఉండాలి. రూరల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతోన్న ఈ లెనిన్ చిత్రం లో అఖిల్ యాక్షన్ బట్టి సినిమా హిట్ రేంజ్ ఉంటుంది. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ఎంత బాగా వచ్చాయన్న దాని మీదే ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది

.లెనిన్ సినిమా హిట్ అవడం అఖిల్ కే కాదు హీరోనే భాగ్యశ్రీ కు, నాగార్జున కు, దర్శకుడుకి, నిర్మాత నాగ వంశి కి చాలా అవసరం.  రేపు లెనిన్ సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.  లెనిన్ సినిమా ను చూడమని నాగ వంశి  అభ్యర్థిస్తూ ఒక పోస్ట్ పెట్టారు.

Trailer