Fauzi షూటింగ్ లో బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ ను కుట్టిన విషపూరిత కీటకం ; ఆస్పత్రిలో రాకేష్ శర్మ
ప్రభాస్ హీరో గా నటిస్తోన్న Fauzi చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. అయితే షూట్ విరామ సమయంలో సాంకేతిక నిపుణులతో మాట్లాడుతుండగా బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ ను ఒక విషపూరిత కీటకం కుట్టింది. అయితే దానిని అంతగా పట్టించుకోలేదు. విషపూరిత కీటకం కుట్టిన ఆరు గంటల తరవాత నటుడు రాజేష్ శర్మ కాలు నొప్పి పుట్టడం మొదలైంది.
అయితే ఆ నొప్పితోనే కోల్ కతా వెళ్ళడానికి విమానం ఎక్కారు. ఈ విమాన ప్రయాణంలో తీవ్రమైన జ్వరం రావడంతో ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. అయితే ఆ తరవాత రోజు మణిపాల్ హాస్పిటల్ లో చేరారు. ఒక రోజు గడిచిన తరవాత కూడా తీవ్రమైన జ్వరం తో బాధపడడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. అంతే కాకుండా విషం తన కుడి మోకాలి వరకు పాకడంతో కాలి మీద బొబ్బలు రావడం మొదలయ్యాయి.
ప్రస్తుతం డాక్టర్ ల పర్యవేక్షణలో ఉన్న రాకేష్ శర్మ ఆరోగ్య పరిస్థితి ఇంకా సీరియస్ గానే ఉంది. రక్తం గడ్డ కట్టడం, ఇన్ఫెక్షన్ శరీరంలోని ఇతర భాగాలకు విస్తరిస్తే మరింత ప్రమాదం అంటున్న డాక్టర్లు అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు.
రాజేష్ శర్మ ఆరోగ్యతో తిరిగి రావాలని ప్రగడ టీవీ ప్రార్థిస్తోంది.


