4th T 20 : మళ్ళీ నిరాశపరచిన వైభవ్ సూర్యవంశీ

by | Jul 9, 2026 | క్రీడలు | 0 comments

భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న నాలుగవ టి 20 మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

 స్టార్ ఓపెనర్ వైభవ్ సూర్య వంశి ఈ మ్యాచ్ లో కూడా 10 బంతుల్లో 15 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా నాలుగు పరుగులే చేసి జోష్ టంగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.  కాసేపటికే 16 పరుగులు చేసిన అభిషేక్ శర్మ కూడా రషీద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు

ఏడు ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. ప్రస్తుతానికి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 13 పరుగులతో, శివమ్ దూబే 1 పరుగుతో క్రీజ్ లో ఉన్నారు

మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, తరవాతి రెండు మ్యాచ్ లను గెలిచినా ఇంగ్లాండ్ జట్టు సిరీస్ లో 2-0 తో ముందంజలో ఉంది.  ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ ఇంగ్లాండ్ వశం అవుతుంది.  ఈ మ్యాచ్ లో భారత జట్టు గెలిస్తే సిరీస్ సమం చేయడానికి అవకాశం ఉంటుంది