‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ రాకింగ్ స్టార్ హీరో యశ్ (Yash) . ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. (Toxic) ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార (Nayanathara) , రుక్మణీ వసంత్ (Rukmini Vasanth) , హుమా ఖురేషి, తార సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions), మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das) దర్శకత్వం వహిస్తున్న ఈ ‘టాక్సిక్’ (Toxic) సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించింది. ఈ సినిమా టీజర్ (Teaser) డేట్‌ను తాజాగా ప్రకటించారు మేకర్స్. టాక్సిక్ టీజర్‌ను ఫిబ్రవరి 20న ఉదయం 9.35 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్లో యశ్ మందు బాటిల్ తాగుతూ ఉన్నాడు. ఈ టీజర్ డేట్ ప్రకటనతో సోషల్ మీడియాలో ‘యశ్ 19’ ట్రెండింగ్‌లోకి వచ్చింది. యశ్ గత సినిమాల టీజర్లు సృష్టించిన రికార్డుల కారణంగా, ‘టాక్సిక్’ టీజర్ (Toxic Teaser) కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తుందనే అంచనాలున్నాయి. కాగా, ఈ భారీ చిత్రాన్ని మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

