మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi) . బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) , సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌లో కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక పెద్ది చిత్రాన్ని 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సినిమా రిలీజ్‌కి ఇంకా రెండు నెలలు టైమ్ ఉండగానే నాన్ దియేట్రికల్ రైట్స్ కోసం పలువురు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ పోటీపడగా మేకర్స్ భారీ మొత్తం డిమాండ్ చేశారట. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పోటీ నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) తప్పుకోవడంతో డీల్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) కి ఓకే అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల డీల్ ఫినిష్ చేసుకోవడం రైట్స్ ను దాదాపు రూ. 130 కోట్ల భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అలాగే ఈ మూవీ ఆడియో రైట్స్ మరో 18 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ఇంకా ఫైనల్ కాలేదు. కానీ భారీ మొత్తంలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ‘పెద్ది’ (Peddi) చిత్రాన్ని నేరుగా హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయినా కూడా హిందీ శాటిలైట్ రైట్స్ వేరుగా ఉంటాయి. మొత్తంగా పెద్ది సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి రూ. 150 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

