తెలంగాణ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. నిన్నటి దాకా ఒక లెక్క.. నేటి నుంచి మరో లెక్క అన్నట్టుగా మంచిర్యాల జిల్లా కేతనపల్లి అట్టుడికిపోతోంది. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ (BRS) ఫైర్ బ్రాండ్ బాల్క సుమన్ అరెస్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు కేతనపల్లిలో ఏం జరిగింది? మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి జరిగిందా? లేక బాల్క సుమన్ (Balka Suman) కాన్వాయ్ పైనే దాడి జరిగి, రివర్స్ లో కేసులు పెట్టారా? మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం జరుగుతున్న ఈ పొలిటికల్ మైండ్ గేమ్ వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి.. అనేది క్లియర్ గా తెలుసుకుందాం.. రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు సహజం.. కానీ కేతనపల్లి మున్సిపాలిటీ ఎపిసోడ్ మాత్రం పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో.. సుమన్ నివాసం చుట్టూ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ‘నన్ను అరెస్ట్ చేస్తారా? ఎందుకు చేస్తారు?’ అంటూ బాల్క సుమన్ పోలీసులతో ససేమిరా అనడం, కార్యకర్తల తోపులాట మధ్య ఆయనను బలవంతంగా పోలీస్ వ్యాన్ ఎక్కించడం.. ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి.
అయితే ఈ అరెస్ట్ కు ప్రధాన కారణం ఏంటి? నిన్న మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పై దాడి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ యాక్షన్ తీసుకున్నారు. కానీ ఇక్కడే బాల్క సుమన్ ఒక బాంబ్ పేల్చారు. ‘దాడి జరిగింది మంత్రి కాన్వాయ్ పై కాదు, నా కాన్వాయ్ పై.. కాంగ్రెస్ నేతలే మాపై రాళ్లు రువ్వారు.. పోలీసులు మాపైనే లాఠీఛార్జ్ చేసి, మళ్లీ మాపైనే అక్రమ కేసులు పెట్టారు’ అంటూ సుమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచుతున్నాయి. సుమన్ ఆరోపణలు ఎంత సీరియస్ గా ఉన్నాయో. అసలు ఈ గొడవకు మూల కారణం.. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ సీటు! బీఆర్ఎస్ కు అక్కడ స్పష్టమైన మెజార్టీ ఉంది. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, సంఖ్యాబలం లేకపోయినా ఆ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోందని, తమ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తోందని గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. మంత్రి వివేక్ రౌడీయిజం, దౌర్జన్యంతో రాజకీయాలు చేస్తున్నారని బాల్క సుమన్ నేరుగా ఆరోపిస్తున్నారు. ‘దమ్ముంటే నన్ను జైలుకు పంపండి, నేను సిద్ధం’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సుమన్ విసిరిన సవాల్.. రాబోయే రోజుల్లో మంచిర్యాల రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతోందో అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు బాల్క సుమన్ అరెస్ట్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు (Harish Rao) తప్పు బట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు. క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చిందనే అక్కసుతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు. అధికార, పోలీస్, ధన బలంతో కాంగ్రెస్ చట్టాలను తుంగలో తొక్కిందన్నారు. ఇది కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని హరీష్‌రావు అన్నారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీక్రిష్ణ రాజ్యాంగాన్ని కూని చేస్తూ పోలీసుల సహకారంతో బీఆర్ ఎస్, సీపీఐ నాయకులపైనే దాడులు చేయడం చూ స్తూ పోలీసుశాఖ ఉన్నతాధికారులు ఉండడం రా జ్యాంగ విరుద్దమేనని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మండిపడ్డారు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్‌ఎస్ నాయకులను పథ కం ప్రకారమే అరెస్టు చేశారని ముందస్తు నోటీ సులు అందించకుండా పోలీసులు అరెస్టు చేయ డం సరికాదన్నారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటి చె ౖర్మన్, వైస్ చైర్మన్‌లు ఎన్నుకునేందుకు పూర్తి స్థాయి కోరం సభ్యులు బీఆర్‌ఎస్‌కు ఉన్నా మంత్రి కన్నుసన్నల్లోనే ప్రత్యేకాధికారితోపాటు పోలీసులు నడుచుకున్నారని కాంగ్రెస్ దౌర్జన్యపాలన మరొ క్కసారి తేటతెల్లమైందన్నారు.కేతనపల్లి మున్సిపాలిటీ ఎవరి వశం అవుతుంది? బాల్క సుమన్ (Balka Sumanr) అరెస్ట్ తో బీఆర్ఎస్ (BRS) ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతోంది? ఇది ఇక్కడితో ఆగుతుందా.. లేక మరింత ఉగ్రరూపం దాలుస్తుందా అనేది చూడాలి..

