పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడుగా వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh) . హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree Leela) కథానాయికగా నటిస్తుంది. రాశీఖన్నా (Rasi Khanna) కీలక పాత్రలో అలరించనుంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. గతంలో పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొంటున్న ఈ సినిమా ఈ సినిమాను 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రబృందం వేగవంతం చేసింది. ఇటీవల రిలీజైన ‘దేఖ్ లేంగే సాలా’ లిరికల్ వీడియో మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి పాట సూపర్ హిట్ కావడంతో సెకండ్ సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్రబృందం ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అనే రెండో సాంగ్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అంటూ సాగే పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటలో పవన్ కళ్యాణ్ తన మార్క్ గ్రేస్‌తో పాటుగా తనదైన స్టైల్‌తో సందడి చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ ప్రోమో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలో చాలా రోజుల తర్వాత ఒక సూపర్ హిట్ సాంగ్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సాంగ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ కంప్లీట్ మాస్ సాంగ్‌ను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నారు మేకర్స్.

