టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) కథానాయకుడిగా దర్శకుడు అభిలాష్ రెడ్డి (Abhilash Reddy) దర్శకత్వంలో తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘బైకర్’ (Biker) . ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్లో వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ (Rajasekhar) ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. బ్రహ్మాజి, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో రిటైర్ అయిన బైకర్‌గా రాజశేఖర్ కనిపించగా ఆ పై శర్వానంద్‌కు కోచ్ పాత్ర చేసినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇప్పటివరకు యూవీ క్రియేషన్స్ బ్యానర్లో శర్వానంద్ (Sharwanand) చేసిన సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచిన నేపథ్యంలో ‘ బైకర్’ (Biker) కూడా అదే విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది. ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 3న బైకర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరగా, ప్రమోషన్స్ కోసం భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట మేకర్స్. ‘నారి నారి నడుమ మురారి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత శర్వానంద్ నటిస్తున్న ‘బైకర్’ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలా మంది పోటీ పడ్డారు. అయితే అందరి కంటే సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ఒక అడుగు ముందుకి వేసి రైట్స్ దక్కించుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి సంబంధించిన దిల్ రాజు ఈ సినిమా నైజాం, ఏపీ హక్కులను రూ.20 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్. టైర్ 2 హీరో అయిన శర్వానంద్ మీద టాలీవుడ్ నిర్మాతలకు ఉన్న నమ్మకాన్ని ఇది మరోసారి రుజువు చేస్తోంది. ఈ చిత్రానికి దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ మరో బలంగా మారడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.


