టాలీవుడ్ యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా ఇటీవలే ‘ఫంకీ’ (Funky) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఫంకీ’ చిత్రానికి ‘జాతిరత్నాలు’ఫేం కె.వి.అనుదీప్ దర్శకత్వం వహించగా.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తో తీవ్రంగా నిరాశపరిచింది. వరుస అపజయాలతో విశ్వక్ ఇప్పుడు తన కెరీర్‌పై మరోసారి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ విషయంలో తీసుకునే నిర్ణయాలు నిర్మాతలకు కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇటీవల ఆయన నటించిన చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దాంతో మేకర్స్ చాలానే నష్టపోయారు. అయినా కూడా విశ్వక్ సేన్ రూ. 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇటీవల విడుదలైన ‘ఫంకీ’ సినిమా కథను కూడా కొందరు నిర్మాతలకు వినిపించగా.. విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ భారీగా ఉండడంతో వారు వెనకడుగు వేశారని తెలుస్తోంది. ఆఖరికి నిర్మాత నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మించినప్పటికీ, ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక మరోవైపు ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీకి సీక్వెల్ నిర్మించేందుకు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత సురేశ్‌బాబు ముందుకొచ్చినప్పటికీ, విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ డిమాండ్ కారణంగా ఆయన వెనక్కి తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వక్ సేన్ కు విజయం చాలా అవసరం కాబట్టి రెమ్యునరేషన్ డిమాండ్ అంశాన్ని పక్కనపెట్టడం మంచిదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద సినిమా సూపర్ హిట్ అయితే రెమ్యునరేషన్ దానికదే పెరుగుతోందనే విషయాన్ని విశ్వక్ సేన్ గ్రహించాలని పేర్కొంటున్నారు. ఇక మరోవైపు విశ్వక్ సేన్ మరోసారి దర్శకుడుగా మెగా ఫోన్ పట్టాడు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘కల్ట్’. ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా దమ్కీ’ వంటి సినిమాల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ కాకర్ల, కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ వంటి అంతర్జాతీయ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.

