నాగ్ అశ్విన్ దర్శకత్వం లో వైజయంతి మూవీస్ పతాకం పై నిర్మితమైన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కి. ఫుల్ రన్ లో కల్కి 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది
ప్రభాస్, అమితాబ్, దీపికా పదుకునె, కమల్ హాసన్ వంటి భారీ తారాగణం, మేకింగ్ పరం గా భారీతనం, మహానటి లాంటి అద్భుత చిత్రాన్ని తీసిన దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకుడు కావడం, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని శక్తివంతం గా తీర్చి దిద్ధడం, పార్ట్ 2 ఉందన్న లీడ్ ఇవ్వడం ఈ చిత్రానికి ప్రధాన బలాలు.
హీరో ప్రభాస్ క్యారెక్టర్ ను స్టార్ వార్స్ తరహాలో తీర్చిదిద్దడం, సాంకేతికతను ఉపయోగించి సరికొత్త వాహనాలను తయారు చేయడం వంటివి ప్రేక్షకులను సరికొత్త ప్రపంచానికి తీసుకు వెళతాయి.
అయితే ఇప్పుడు ప్రభాస్ కల్కి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రంగం సిద్ధం చేసుకుంది. సంక్రాంతి కానుకగా ఈ జనవరి 12 న సాయంత్రం 5 గంటల ముప్పై నిమిషాలకు జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవబోతోంది.
థియేటర్లో కలెక్షన్స్ సునామి సృష్టించిన ఈ ప్రభాస్ కల్కి టెలివిజన్ లో ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి. ప్రభాస్ సినిమా అంటే జీ తెలుగు లో వస్తుంది.
గతం లో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్, యోగి, బుజ్జిగాడు, సాహో, చక్రం, మున్నా, రాధే శ్యామ్ సినిమాలు కూడా జీ తెలుగు లోనే ప్రసారమయ్యాయి, ప్రసారమవుతున్నాయి. అయితే ఈ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందినవే

