ప్రస్తుతం ఎండోస్కోపీ ద్వారా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ పని తీరును తెలుసుకుంటున్నారు
అయితే, ప్రపంచంలో మొదటి సారిగా, అతి తక్కువ వ్యయంతో (ఒక సరి వాడి పారేయాలి), రిమోట్ కంట్రోల్డ్ ఎండోస్కోపీ పిల్ ని (అతి చిన్న ) US ఆధారిత కంపెనీ దీనిని అభివృద్ధి చేసింది. కాలిఫోర్నియా బేస్డ్ Endiatx కంపెనీ ఈ పిల్ బాట్ (రోబోట్/డ్రోన్) ని డిజైన్ మరియుఅభివృద్ధి చేసింది. ఆరోగ్య, మెడికల్ రంగంలో గేమ్ చేంజర్ ఈ పిల్ బాట్ (రోబోట్) టెక్నాలజీ
మొదటి సారిగా దీనిని హైదరాబాద్ ఏ ఐ జి హాస్పిటల్ లో అందుబాటులోకి తెచ్చారు.
గ్యాస్ట్రో ఇంటెస్టినల్ పరీక్షలను ఈ టెక్నాలజీ ద్వారా ఎంత సమర్ధవంతంగా చేయవచ్చో తెలుసుకుందాం
- మొదటగా పేషెంట్ ఈ పిల్ బాట్ ను నీరు త్రాగడం ద్వారా తన శరీరంలోకి పంపాలి
- ఆంటిబయోటిక్ లా ఉండే ఈ 13 MM x 30 MM సైజు పిల్ బాట్ మన శరీరంలో కి వెళ్లిన తరవాత, క్యాప్సూల్ లో కెమెరా ఆక్టివేట్ అవుతుంది. ఈ క్యాప్సూల్ కు LED లైట్స్ ఉంటాయి. ఈ క్యాప్సూల్ కు అటాచ్ చేసిన ట్రాన్స్మిటర్ ద్వారా మన కడుపులో ఉన్న ఆర్గాన్స్ ని 60,000 ఫ్రేమ్స్ వీడియో తీస్తుంది
- ఈ పిల్ బాట్ (ఈ క్యాప్సూల్) ను ఆండ్రాయిడ్ ఫోన్, రిమోట్ డివైస్ ద్వారా బయట నుండి వైద్య నిపుణులు ఆపరేట్ (కంట్రోల్) చేస్తారు
- 24 నుండి 48 గంటలలో నాచురల్ గా ఈ క్యాప్సూల్ మన శరీరం నుండి బయటకు వస్తుంది
ఏ ఐ జి హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం, ఈ పిల్ బాట్ కాస్ట్ 35 డాలర్లు. మన ఇండియా లో 5 వేల రూపాయలు.
ప్రస్తుతానికి దీని సామర్ధ్యం మీద పరీక్షలు జరుగుతున్నాయి. మరో రెండేళ్లలో పూర్తి స్థాయిలో ఈ పిల్ బాట్ అందుబాటులోకి వస్తుంది. దీనికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ ని ఉపయోగించి మరింత సమర్ధవంతం గా ఈ టెక్నాలజీ ని ఉపయోగించవచ్చని నిపుణులు చెప్పారు.
గ్యాస్ట్రో ఇంటస్టినల్ డయాగ్నోస్టిక్స్ కు ఇది ఒక నూతన అధ్యాయం అని చెప్పవచ్చు

