భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ 185 అల్ అవుట్ ; నిరాశ పరిచిన కోహ్లీ

by | Jan 3, 2025 | Uncategorized

భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు సిడ్నీ లో ప్రారంభమైన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్ 185 పరుగులకే కుప్ప కూలింది

17 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయిన భారత జట్టు ను గిల్, కోహ్లీ ఆదుకున్నారు. అయితే సరిగ్గా లంచ్ విరామానికి ముందు ఓవర్లో, లియాన్ బౌలింగ్ లో గిల్ అవుట్ అయ్యాడు.

రిషబ్ పంత్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.  ఆఖరున బుమ్రా ధాటి గా ఆడి భారత జట్టు స్కోరును 150 దాటించాడు. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్ లో డక్ అవుట్ అయ్యాడు

జైస్వాల్ 10, రాహుల్ 4, గిల్ 20, కోహ్లీ 17, పంత్ 40, జడేజా 26, నితీష్ కుమార్ రెడ్డి 0, సుందర్ 14,  ప్రసిద్ కృష్ణ 3, బుమ్రా 22, సిరాజ్ 3 పరుగులు చేశారు

ఆస్ట్రేలియా బౌలర్లలో బొలాండ్ 4 వికెట్లు, స్టార్క్ 3 వికెట్లు, కమిన్స్ 2 వికెట్లు, లియాన్ ఒక వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో రోహిత్ స్థానంలో గిల్, ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చారు.

ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ స్థానంలో బుమ్రా భారత జట్టును నడిపించాడు.  ఈ సిరీస్ మొదటి టెస్ట్ లో భారత జట్టు బుమ్రా నాయకత్వంలో ఘన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే.

ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత జట్టు, ఈ మ్యాచ్ ఓడిపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నుండి నిష్క్రమించినట్టే