ఐదవ టెస్ట్ లో లంచ్ విరామానికి భారత్ 57/3 ; ఆడకుండానే రోహిత్ అవుట్

by | Jan 3, 2025 | వార్తలు

భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ రోజు సిడ్నీ లో ప్రారంభమైన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ విరామానికి 3 వికెట్లు నష్టపోయి 57 పరుగులు చేసింది.

17 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయిన భారత జట్టు ను గిల్, కోహ్లీ ఆదుకున్నారు. అయితే సరిగ్గా లంచ్ విరామానికి ముందు ఓవర్లో, లియాన్ బౌలింగ్ లో గిల్ అవుట్ అయ్యాడు.

జైస్వాల్ 10, రాహుల్ 4, గిల్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు.  విరాట్ కోహ్లీ 12 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, బొలాండ్, లియాన్ తలా వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో ఆకాష్ దీప్ స్థానంలో, ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు

ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు సీనియర్ బ్యాట్స్ మన్ అయిన విరాట్ కోహ్లీ మీదే ఉంది

ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ స్థానంలో బుమ్రా భారత జట్టును నడిపించబోతున్నాడు.  ఈ సిరీస్ మొదటి టెస్ట్ లో భారత జట్టు బుమ్రా నాయకత్వంలో ఘన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే.