ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా యూ పి వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన యూ పి వారియర్స్ 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది
యూ పి వారియర్స్ ఓపెనర్లు కిరణ్ నవగిరే, దినేష్ వృందా మొదటి వికెట్ కు 66 పరుగులు జోడించారు. కిరణ్ నవగిరే ధాటిగా ఆడుతూ, కేవలం 27 బంతుల్లో 51 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన సెహ్రావాత్ 37 పరుగులు చేయగా, చివర్లో హెన్రీ 15 బంతుల్లో 33 పరుగులు చేయడంతో యూ పి వారియర్స్ 166 పరుగుల భారీ స్కోర్ సాధించింది
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల లో సదర్లాండ్ రెండు వికెట్లు తీయగా కాప్, జొనసేన్, అరుంధతి రెడ్డి, మణి తల ఒక వికెట్ తీశారు
అనంతరం 167 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, మెగ్ లానింగ్ లు మొదటి వికెట్ కు 65 పరుగులు జోడించారు
షెఫాలీ వర్మ 16 బంతుల్లో 26 పరుగులు చేసి అవుట్ అయ్యింది. జెమిమా రోడ్రిగ్స్ డక్ అవుట్ అయ్యి వెను తిరిగింది.
కెప్టెన్ మెగ్ లానింగ్ బాద్యతాయుతం గా ఆడి 49 బంతుల్లో 69 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన సదర్లాండ్, కాప్ మరో వికెట్ పడకుండా ఢిల్లీ క్యాపిటల్స్ ను గెలిపించారు. సదర్లాండ్ 35 బంతుల్లో 41 పరుగులు చేయగా, కాప్ 17 బంతుల్లో 29 పరుగులు చేసింది
యూ పి వారియర్స్ బౌలర్లలో దీప్తి శర్మ, సోఫీ, హారిస్ తలా ఒక వికెట్ తీశారు. యు పి వారియర్స్ ఫీల్డింగ్ తప్పిదాల వల్లే పరాజయం పాలైంది

