పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నారు. స్పిరిట్ మూవీకి హర్షవర్థన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తుండగా..ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, మాలీవుడ్ స్టార్ హీరో మమ్మూట్టి కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు సందీప్ వంగా నటినటులందరికి కొన్ని నిబంధనలు విధించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సినిమాలో ఈ సినిమాలో నటించే వారితో పాటుగా హీరో ప్రభాస్ కూడా ఎలాంటి అప్‌డేట్స్ బయటకు వెల్లడించొద్దని స్ట్రాంగ్ గా చెప్పినట్లు తెలుస్తోంది.
అలాగే స్పిరిట్ మూవీలో ప్రభాస్ లుక్ విషయంలో కూడా సందీప్ రెడ్డి వంగా ఇంకో సీరియస్ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. స్పిరిట్ లో ప్రభాస్ మెకోవర్ చాలా కీలకమని భావించిన సందీప్ సినిమా పూర్తయ్యేంత వరకు ప్రభాస్ తన లుక్ మార్చుకోకుండా ఉండాలని గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది.

