ఛాంపియన్స్ ట్రోఫీ లో సొంత గడ్డపై పాకిస్థాన్ కు ఘోర పరాభవం
ఛాంపియన్స్ ట్రోఫీ లో ఈ రోజు పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ లో జరిగిన మొదటి మ్యాచ్ లో పాక్ పై, న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
321 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్, ఏ దశలోనూ 320 పరుగులను చేదించేలా కనిపించలేదు. పాక్ మొదటి నలుగురు బ్యాట్స్ మన్ స్ట్రైక్ రేట్ 59.14. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు పాక్ బ్యాటింగ్ తీరు ఎంత ఘోరంగా ఉందొ
మొదటి నలుగురు బ్యాట్స్ మన్ స్ట్రైక్ రేట్ ఘోరంగా ఉంది. సీనియర్ ఆటగాడు అయిన బాబర్ అజామ్ 90 బంతులు ఆది 64 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. షకీల్ 19 బంతుల్లో 6 పరుగులు, కెప్టెన్ రిజ్వాన్ 14 బంతుల్లో 3 పరుగులు, ఫకర్ జమాన్ 41 బంతుల్లో 24 పరుగులు చేశారు.
సల్మాన్ అఘా ధాటిగా ఆడి 28 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అయితే చివర్లో ఖుష్ దిల్ షా వీరోచితంగా పోరాడాడు. అయితే అతనికి సహకారం అందించే వారు కరువయ్యారు. ఖుష్ దిల్ షా 49 బంతుల్లో 69 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
న్యూజిలాండ్ బౌలర్ల లో రూర్కే, సాంట్నర్ లు మూడేసి వికెట్లు తీయగా, మాట్ హెన్రీ రెండు వికెట్ లు తీశాడు. బ్రెసెవెల్, నాథన్ స్మిత్ చెరో ఒక వికెట్ తీశారు
అంతకు ముందు టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను నిర్మించిన తీరు అమోఘం అని చెప్పవచ్చు
మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మొదట కొంత తడబాటుతో మొదలైంది. ఓపెనర్ కాన్వే 10 పరుగులు చేసి స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కు చిక్కారు. వెటరన్ బ్యాట్స్ మన్ విలియంసన్ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన మిచెల్ కూడా ఎక్కువ సేపు నిలవలేదు. 10 పరుగులు చేసి రవూఫ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
ఒక వైపు వికెట్లు పడుతున్నా, మరో ఓపెనర్ యంగ్ నిలకడైన ఆట తీరును కనపరిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లోనే విల్ యంగ్ సూపర్ సెంచరీ సాధించాడు. విల్ యంగ్ కు, టామ్ లాథమ్ చక్కని సహకారాన్ని అందించాడు. విల్ యంగ్, టామ్ లాథమ్ లు నాలుగవ వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 107 పరుగులు చేసిన విల్ యంగ్ నసీం షా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
ఆ తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ తో, టామ్ లాథమ్ 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ఫిలిప్స్ 39 బంతుల్లో 61 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో రవూఫ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. టామ్ లాథమ్ 104 బంతుల్లో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు
పాకిస్థాన్ బౌలర్ల లో నసీం షా, హారిస్ రవూఫ్ లు చెరో రెండు వికెట్లు తీయగా, అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ తీశారు

