నరేంద్ర మోడీ మార్క్ స్ట్రాటజీ  : ఢిల్లీ కి  సీఎం గా రేఖ గుప్తా

by | Feb 19, 2025 | రాజకీయాలు

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 26 సంవత్సరాల తరవాత ఢిల్లీ పీఠం దక్కించుకున్న బీజేపీ, సీఎంఅభ్యర్థి ఎంపికలో స్ట్రాటజిక్ ని కనబరిచింది

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం, గురువారం రామ్ లీల మైదానంలో ఉదయం 12:35 నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో, ఇదే రామ్ లీల మైదానంలో, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ని స్థాపించారు.  ఇక్కడే, ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి 30 వేల మంది వచ్చే అవకాశం ఉంది

ఈ రోజు భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేఖ గుప్తా ని ఎంపిక చేసింది.  భాజపా ఏం ఎల్ ఏ ల సమావేశంలో రేఖ గుప్తా ను ముఖ్యమంత్రి చేయాలనీ ఏకగ్రీవంగా తీర్మానించారు.  మహిళను సీఎం చేయడం ద్వారా, భాజపా రాజకీయాలలో మహిళలకు కూడా ప్రాధాన్యం ఇస్తుందనే మెసేజ్ ప్రతిపక్షాలకు పంపారు

రేఖ గుప్తా విద్యార్థి జీవితం నుండి రాజకీయాలలో చురుగా పాల్గొనే రేఖ గుప్తా ఆర్ ఎస్ ఎస్, బీజేపీ తో పని చేసిన అనుభవం ఉంది.  బీజేపీ నార్త్ ఢిల్లీ కి మేయర్ గా పని చేసిన అనుభవం ఉంది. అంతే కాకుండా ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ. 

సీఎం తో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం గా పర్వేశ్ వర్మ ను నియమించే అవకాశం ఉంది

రేఖ గుప్తా ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో పాటు, భాజపా పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది

భాజపా సంచలనం నిర్ణయం.  ఢిల్లీకి, ఒక మహిళను, కొత్త ముఖ్యమంత్రి గా భారతీయ జనతా పార్టీ ఏం ఎల్ ఎ ల సమావేశంలో  ఇక గ్రీవం గా ఎన్నుకున్నారు.  ఢిల్లీ కి నాలుగవ మహిళా సీఎం రేఖ గుప్తా.  గతంలో కాంగ్రెస్ కు చెందిన షీలా దీక్షిత్  మాత్రమే సుమారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేశారు.  భాజపా కి చెందిన సుష్మ స్వరాజ్, ఆప్ కు చెందిన ఆతిషి 50-60 రోజులు మాత్రమే ముఖ్య మంత్రి గా పని చేశారు