మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi) . బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 30 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవడానికి సిద్ధమవుతోంది.
పెద్ది (Peddi) చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీనికి సంబందించిన ప్రత్యేక వీడియో ను వృద్ధి సినిమాస్ వారు సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఈ వీడియో లో బుచ్చిబాబు, రామ్ చరణ్ ఉన్నారు. చికిరి చికిరి పాటకు సంబంధించి రామ్ చరణ్ బుచ్చిబాబు పై జోకులు వేశారు. సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ అవుతోంది.
పెద్ది సినిమా నుండి సెకండ్ సింగల్ ‘ రై రై రారా’ పాటను ఈ సోమవారం అంటే మార్చ్ 2 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు
పెద్ది సినిమాలో రామ్ చరణ్ ఆట కూలీగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ లు కీలక పాత్రలలో కనిపించనున్నారు. పెద్ది చిత్రానికి, జాతీయ స్థాయి సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ స్వర సారధ్యం వహిస్తున్నారు
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

