270 కేజీ ల రాడ్ మీద పడి 17 ఏళ్ళ యువ మహిళా పవర్ లిఫ్టర్ మృతి

by | Feb 19, 2025 | వార్తలు

రాజస్థాన్ లో బికనీర్ జిల్లా కు చెందిన 17 ఏళ్ళ యువ పవర్ లిఫ్టర్ యస్తిక ఆచార్య తన కోచ్ నేతృత్వంలో జిమ్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 270 కేజీ ల రాడ్ తన మెడ మీద పడడంతో మెడ విరగడంతో మృతి  చెందింది. తన కోచ్ కు కూడా గాయాలయ్యాయి.  యస్తిక ఆచార్య జూనియర్ నేషనల్ గేమ్స్ లో పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించింది.

ఈ దుర్ఘటన మీద, యస్తిక కుటుంబ సభ్యులు ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు.  పోస్ట్ మార్టమ్ తరవాత బాడీ ను యాస్తిక కుటుంబ సబ్యులకు అందచేశారు