‘వృషకర్మ’కి కౌంట్‌డౌన్ స్టార్.. టీజర్ డేట్ లాక్ చేశారుగా!

by | Feb 25, 2026 | సినిమా

ప్రస్తుతం టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ‘వృషకర్మ’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సుకుమార్‌ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘విరూపాక్ష’ఫేం కార్తీక్‌ దండు (Karthik Dandu) దర్శకత్వంలో మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో నాగచైతన్య (Naga Chaitanya) ను మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్‌ అవతారంలో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘లాపతా లేడీస్‌’ ఫేం స్పర్శ్‌ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటుగా సినీ ప్రియుల్లోనూ భారీ అంచనాలున్నాయి.

ఇది నాగచైతన్య కెరీర్ లో 24వ సినిమాగా తెరకెక్కనుండగా.. ‘కాంతారా’ ఫేమ్ అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ‘వృషకర్మ’ (Vrusha Karma) సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన నాగ చైతన్య ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి కొన్ని నెలలుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశతో ఉన్నారు. టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చెయ్యమని సోషల్ మీడియా వేదికగా చిత్రబృందానికి రిక్వెస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 5న ‘వృషకర్మ’ మూవీ టీజర్‌ (Teaser) ను విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ న్యూస్ వైరల్ అవడంతో సోషల్ మీడియాలో ‘వృషకర్మ’ టీజర్ లోడింగ్ అంటూ ట్రెండింగ్‌లోకి రావడం విశేషం.