నాని-సుజీత్‌ ‘బ్లడీ రోమియో’.. మూవీ బ్యాక్‌డ్రాప్‌ ఇదే.!

by | Feb 25, 2026 | సినిమా

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలతో జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యార‌డైజ్'(The Paradise) సినిమాతో బిజీగా ఉన్న నాని ఆ త‌ర్వాత ఓజీ డైరెక్ట‌ర్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు. నాని కెరీర్ లో 32వ చిత్రంగా రానున్న ‘బ్లడీ రోమియో’ అనౌన్స్‌మెంట్ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలోనే ప్రకటించిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ, తాజాగా దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను నాని పుట్టినరోజు సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఇక ‘ఓజీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుజీత్ (Sujith) చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమాలో నానికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ (Niharika Entertainments) బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం జోనర్ పై ఆసక్తికర వార్త వైరల్ గా మారింది. తాజాగా రిలీజైన గ్లింప్స్‌ను బట్టి చూస్తే ఇది డార్క్ క్రైమ్ కామెడీ టచ్‌తో కూడిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే వీడియోలో కనిపించిన విజువల్స్ ఆధారంగా ఈ సినిమా యుకే ఫుడ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని తెలుస్తోంది. వరల్డ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ ఫుడ్ మాఫియా డాన్‌ను నాని ఎలా ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. అలాగే టైటిల్ లోగోలో కనిపించిన యూకే బ్యాక్‌డ్రాప్ సినిమా లండన్ చుట్టూ తిరగనుందని అర్థమవుతోంది. ఇక ఈ చిత్రంలో నాని ఇప్ప‌టివ‌ర‌కు చూడని డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఇందులో నాని చెఫ్ పాత్ర‌లో క‌నిపిస్తూనే గ్యాంగ్‌స్ట‌ర్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఏదేమైనా ‘ది పారడైజ్’ (The Paradise) మూవీ తర్వాత సుజీత్‌తో పూర్తిగా స్టైలిష్ యాక్షన్ జోన్‌లోకి అడుగుపెడుతున్నారు నాని.